గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో యువకులకు మద్యం అమ్మిన స్నార్ట్ పబ్‌పై కేసు నమోదు చేశామని సీఐ సురేశ్ తెలిపారు. అలాగే పబ్ యజమాని సూర్యనాద్, మేనేజర్ ప్రణేశ్, కారు నడిపిన అభిషేక్‌లను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. బోనాల పండుగ సందర్భంగా మద్యం విక్రయాలపై నిషేధం విధించినప్పటికీ.. స్నార్ట్ పబ్ ఎలా అమ్మిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
పబ్ యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించి మద్యం అమ్మకాలు చేపట్టడం వల్లే ప్రమాదం జరిగిందని అన్నారు. ప్రమాదానికి జరిగేందుకు కారణమైన పబ్ యాజమానిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. అంతేకాకుండా మద్యం తాగి కారు నడిపిన అభిషేక్‌పై కుడా కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు గచ్చిబౌలి సీఐ సురేశ్ వివరించారు.
రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన తరుణి చికిత్సకు సహకరిస్తోందని వైద్యులు పేర్కొన్నారు. అలాగే కారులో ముందు కూర్చున్న సత్య ప్రకాశ్ చేతికి గాయమైందని.. ప్రస్తుతం అతను చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: Gachibowli Accident: సరదాగా సాగిన వాళ్ల ఫ్రెండ్షిప్ డే.. తీరని విషాదంతో ముగిసింది