హైదరాబాద్ పంజాగుట్టలో ఈనెల 4న అనుమాస్పదంగా మృతి చెందిన ఐదేళ్ల బాలిక కేసు(Panjagutta Girl Murder Case)లో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. కడుపులో బలంగా తన్నడం వల్లనే చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలడంతో... హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
బాలిక మృతదేహాన్ని గుర్తు తెలియని ఓ మహిళ వదిలేసి వెళ్లినట్లు పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఎక్కడో చంపి మృతదేహాన్ని వదిలి వెళ్లినట్లుగా గుర్తించారు. ఇప్పటికే నిందితులను గుర్తించిన పోలీసులు... వారు వెళ్లిన దారిలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం 4 పోలీస్, 3 టాస్క్‌ఫోర్స్ బృందాలతో గాలిస్తున్నారు. ఈ నెల 4న ద్వారకాపురి కాలనీలో ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే.
అన్ని ఠాణాల్లోనూ..
రాష్ట్రంలోని అన్ని ఠాణాలతో పాటు.. సామాజిక మాధ్యమాల్లో బాలిక చిత్రాన్ని విడుదల చేసినట్టు పోలీసులు చెప్పారు. బాలిక గురించిన సమాచారం తెలిస్తే ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి (94906 16610), డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నాగయ్య (94906 16613), ఎస్‌ఐ సతీష్ (94906 16365)లకు తెలియజేయాలని కోరారు.
ఇదీ చూడండి: Panjagutta Girl Death: మిస్టరీగా బాలిక మృతి కేసు.. క్షుద్రపూజల కోసమే చంపేశారా?
ఇదీ చూడండి: పంజాగుట్టలో నాలుగేళ్ల బాలిక మృతదేహం... మరణమా? లేక హత్యా?