Fake note gang arrested: మహారాష్ట్ర, బైంసా ప్రాంతాల నుంచి కామారెడ్డిలో దొంగనోట్లను సరఫరా చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్, బైంసా, నిజామాబాద్‌కు చెందిన ఐదుగురు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.3 లక్షల వరకు దొంగనోట్లు లభించినట్లు సమాచారం.
కామారెడ్డి మండలం దేవునిపల్లి పరిధిలోని కొత్త సాయిబాబా ఆలయ ప్రాంతంలోని ఓ ఇంట్లో నుంచి ముఠాను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వారి వద్ద ఎంత మొత్తంలో దొంగనోట్లు దొరికాయి, కామారెడ్డిలో ఈ ముఠాకు ఎవరితో సంబంధాలు ఉన్నాయని విషయాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. దొంగనోట్లను ఎక్కడ తయారు చేస్తారు, నోట్ల సరఫరా ఎక్కడి వరకు ఉంటుంది, దీని వెనుక ఎంత మంది ఉన్నారనే విషయాలు తెలుసుకునేందుకు పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.
ఇవీ చదవండి: