ETV Bharat / crime

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ - crime updates of Telangana

బోయిన్ పల్లిలో ప్రవీణ్ రావు అతని సోదరుల అపహరణ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా కేసుకు సంబంధించిన బలమైన ఆధారాలు లభించే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.

bowenpally kidnap case
ముగ్గురు నిందితులు అరెస్ట్
author img

By

Published : Apr 8, 2021, 3:49 AM IST

ప్రవీణ్ రావు అతని సోదరుల అపహరణ కేసుకు సంబంధించిన ముగ్గురు నిందితులను బోయిన్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితురాలు ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ ఆమె భర్త భార్గవ్ రామ్ , అత్తామామలు, తమ్ముడు జగత విఖ్యాత్ రెడ్డిలతోపాటు మరికొందరు నిందితులు షరతులతో కూడుకున్న బెయిల్​పై విడుదలై ప్రతి 15 రోజులకోసారి ఠాణాకు హాజరై సంతకాలు చేసి వెళ్తున్నారు.

ఈ కేసులో మరో ప్రధాన నిందితుడైన గుంటూరు శ్రీనుకు సమీపస్తులైన గుంటూరు ఆ పరిసర ప్రాంతాలకు చెందిన కృష్ణ, చైతన్య, సురేశ్​ను పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ముగ్గురి ద్వారా కేసుకు సంబంధించిన బలమైన ఆధారాలు లభించే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఇదీ చదవండి: పరీక్షా పే చర్చ- ఏపీ విద్యార్థిని ప్రశ్నకు మోదీ సమాధానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.