ETV Bharat / crime

Abdullapurmet Double Murder Case : అబ్దుల్లాపూర్‌మెట్‌ జంట హత్య కేసు.. అతడే హంతకుడు - అబ్దుల్లాపూర్‌మెట్ జంట హత్యల కేసు అప్‌డేట్స్

Abdullapurmet Double Murder Case : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన హైదరాబాద్ నగర శివారులో జంట హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ హత్యలకు కారణం వివాహేతర సంబంధమేనని అనుమానించిన పోలీసులు విచారణలో అసలు కారణాన్ని నిర్ధరించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో యశ్వంత్, జ్యోతిలను హత్య చేసిందెవరో కనిపెట్టారు. వారిని అత్యంత క్రూరంగా హతమార్చింది ఒక్కడేనని చెప్పారు. నిందితుణ్ని అరెస్టు చేశారు.

Abdullapurmet Double Murder Case
Abdullapurmet Double Murder Case
author img

By

Published : May 4, 2022, 1:45 PM IST

Abdullapurmet Double Murder Case : హైదరాబాద్‌ శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కొత్తగూడెం సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. వివాహేతర సంబంధంతోనే యశ్వంత్‌, జ్యోతిల హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలి భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతణ్ని విచారించగా అసలు విషయం బయటపడింది.

అతడే హంతకుడు : జ్యోతి భర్తే జంట హత్యలు చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం జ్యోతి.. యశ్వంత్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లడం ఆమె భర్త చూశాడని తెలిపారు. ఇద్దరిని వెంబడించి కొత్తగూడ వద్దకు చేరుకున్న భర్త.. వాళ్లు ఏకాంతంగా గడపడాన్ని చూసి తట్టుకోలేక పోయాడని చెప్పారు.

Abdullapurmet Double Murder Case Updates : "జ్యోతి, యశ్వంత్‌లు కలిసి బైక్‌పై వెళ్లడం చూసిన ఆమె భర్త.. వాళ్లను ఫాలో అయ్యాడు. కొత్తగూడ వద్ద వాళ్లు ఏకాంతంగా గడపం చూసి తట్టుకోలేకపోయాడు. కోపోద్రిక్తుడైన అతడు విచక్షణ కోల్పోయి క్షణికావేేశంలో వారిపై దాడి చేశాడు. మొదట జ్యోతిని తలపై బండరాయితో మోదాడు. ఆ ధాటికి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇంతలో యశ్వంత్ తేరుకునేలోపే స్క్రూ డ్రైవర్‌తో అతడి గుండెపై పొడిచాడు. అనంతరం అతడి మర్మాంగంపై దాడి చేసి ఛిద్రం చేశాడు. ఇద్దరు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత జ్యోతి భర్త అక్కణ్నుంచి పారిపోయాడు."

- పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.