ETV Bharat / crime

Kondapur case: కుటుంబ నేర కథాచిత్రమ్.. అత్యాచారయత్నం కేసులో కొత్త కోణం - శ్రీకాంత్

Kondapur case: భర్తతో సన్నిహితంగా ఉంటున్న యువతిపై దారుణానికి తెగించిన గాయత్రి కేసులో దర్యాప్తు కొనసాగుతుండగానే.. కుటుంబ సభ్యుల ఆస్తి తగాదాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆస్తిపై గాయత్రి ఆమె భర్త శ్రీకాంత్ కన్నేశారని పోలీసులు వారికే అండగా నిలుస్తున్నారని.. గాయత్రి తల్లి , సోదరి ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీస్‌ స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ తిరుగుతుండగా తాజాగా వారిపై శ్రీకాంత్‌ మరో ఫిర్యాదు చేశాడు.

Kondapur case:
గాయత్రి కేసు
author img

By

Published : May 31, 2022, 11:58 AM IST

కుటుంబ నేర కథాచిత్రమ్.. ఆస్తుల కోసం రచ్చకెక్కిన అక్కాచెల్లెళ్లు

Kondapur case: హైదరాబాద్‌లో సంచలనం రేపిన యువతి అత్యాచారయత్నం కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. గాయత్రి అరెస్ట్ అవ్వడంతో... ఆస్తి తగాదాలు బయటపడ్డాయి. గాయత్రి ఇంట్లోకి వెళ్లేందుకు తల్లి, సోదరి ప్రయత్నించారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న గాయత్రి భర్త శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేశారు.

కొండాపూర్‌కు చెందిన రత్నరాజు, కృష్ణవేణిలకు సౌజన్య, గాయత్రితో పాటు కుమారుడు ఉన్నారు. రత్నరాజు ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసేటప్పుడు గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్‌ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు. ఆస్తి పంపకాల్లో తలెత్తిన గొడవలతో రత్నరాజు, కృష్ణవేణి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. తనను వేధిస్తున్నాడంటూ భర్తపై కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2015లో రత్నరాజు మరణించాక గొడవలు మరింత ముదిరాయి. ప్రేమవివాహం చేసుకుని కుటుంబానికి దూరంగా ఉన్న గాయత్రి... భర్త నుంచి విడిపోయిన తర్వాత శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకుంది. కొండాపూర్‌లోని ఓ ఫ్లాట్‌లో శ్రీకాంత్‌తో కలిసి నివాసముంటోంది. వారు ఉన్న ఫ్లాటులోకి కృష్ణవేణి, సౌజన్య అక్రమంగా ప్రవేశించారంటూ గతంలో కేసు నమోదైంది. తగాదాలు జరుగుతున్న సమయంలోనే సివిల్స్‌కు సిద్ధమవుతున్న శ్రీకాంత్‌కు ఆంధ్రాకు చెందిన యువతి దగ్గరైంది. ఆమెను గాయత్రికి పరిచయం చేయగా...శ్రీకాంత్‌తో సన్నిహితంగా ఉండటాన్ని భరించలేక... గాయత్రి ఆమెపై దారుణానికి ఒడిగట్టింది.

యువతిపై అత్యాచారయత్నం కేసులో గాయత్రి జైలుకు వెళ్లడంతో ఆమె తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య, సోదరుడు ప్రదీప్‌రాజు, బాబాయ్‌ మల్లిఖార్జున్‌ కొండాపూర్‌లోని ఇంటికి వెళ్లారు. శ్రీకాంత్‌ ఇంట్లో ఉండగానే లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న వాచ్‌మెన్‌పై దాడి చేశారు. శ్రీకాంత్‌ డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. పోలీసులు వారిని బలవంతంగా పంపించేశారు. శ్రీకాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సౌజన్య, కృష్ణవేణి, ప్రదీప్‌రాజు, మల్లిఖార్జున్‌లపై కేసు నమోదు చేశామని గచ్చిబౌలి సీఐ సురేష్‌ తెలిపారు. సౌజన్యపై గతంలోనూ రెండు ఎఫ్​ఐఆర్​ నమోదైనట్లు వెల్లడించారు. తాను ఎస్‌హెచ్‌వోగా ఉన్నపుడు 20 కేసులు నమోదు చేసినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు.

నిందితులతో కుమ్మక్కై గచ్చిబౌలి సీఐ సురేష్ తమను వేధిస్తున్నారని గాయత్రి సోదరి సౌజన్య ఆరోపించారు. ఇంట్లో ఉండేందుకు శ్రీకాంత్​కు ఎలాంటి హక్కు లేదన్నారు. తన సోదరి ఇలా తయారవడానికి శ్రీకాంత్ కారణమని అతడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తమ కుటుంబాన్ని ఎంతో కాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు. ఆస్తి తగాదాలతో గాయత్రి కేసుకు ఎలాంటి సంబంధం లేదన్న పోలీసులు..ఇప్పటికే నిందితులను అరెస్ట్‌ చేశామని తెలిపారు. అత్యాచారాయత్నానికి ఒడిగట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇవీ చదవండి: 'యువతిపై లైంగిక దాడి.. తెలిసిన వారే గాయత్రికి సహకరించారు'

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.