హైదరాబాద్ ఖైరతాబాద్ కూడలిలో పోలీసు ఎస్కార్ట్ వాహనం దగ్ధమైంది. విద్యుదాఘాతంతో వాహనంలో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. వాహనంలో ఉన్న సిబ్బంది వెంటనే తేరుకొని దిగిపోవటంతో ప్రాణాపాయం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వాహనంలో మంటలను అదుపులోకి తెచ్చారు. కార్యాలయాలకు వెళ్లే సమయం కావడంతో... ఖైరాతాబాద్ కూడలిలో ట్రాఫిక్ కొద్దిసేపు స్తంభించింది. పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్దీకరించారు.
ఇదీ చూడండి: SEXUAL HARASSMENT ON TRAINEE SI: లైంగిక ఆరోపణలతో మరిపెడ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు