ETV Bharat / crime

నిప్పు నిదానంగా రాజుకుందా?.. బోయిగూడ అగ్నిప్రమాదంపై పోలీసుల పరిశోధన - బోయగూడ టింబర్‌డిపో

Boyaguda Fire Accident: సికింద్రాబాద్ బోయగూడ టింబర్‌డిపోలో 11 మందిని పొట్టనబెట్టుకున్న అగ్నిప్రమాదానికి కారణాలు కనుక్కోవటంలో పోలీసులు తలమునకలయ్యారు. విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగాయా..? లేక గ్యాస్​ సిలిండర్​ లీకయ్యిందా..? తెలుసుకుంటున్న క్రమంలో మరోసారి మంటలు వచ్చాయి. ప్రమాదం ఏ కారణం చేత జరిగిందనే అంశాలపై దర్యాప్తు జరుగుతోంది.

నిప్పు నిదానంగా రాజుకుందా?.. బోయిగూడ అగ్నిప్రమాదంపై పోలీసుల పరిశోధన

author img

By

Published : Mar 25, 2022, 11:02 AM IST

సికింద్రాబాద్‌లోని బోయిగూడ తుక్కుగోదాములో బుధవారం(మార్చి 23న) సంభవించిన భారీ అగ్నిప్రమాదానికి కారణాలను పోలీసులు పరిశోధిస్తున్నారు. మంటలు కార్చిచ్చుగా మారాయా? అట్టలు, చెత్త, ఇతర వ్యర్థపదార్థాలు లోపల్లోపల రగులుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయేమోనని అనుమానిస్తున్నారు. విద్యుదాఘాతమని భావించిన పోలీసులు... గోదాములో ఓ మూలకు గ్యాస్‌ సిలిండర్‌ ఉండడంతో గ్యాస్‌లీకయ్యే అవకాశం ఉందన్న కోణంలో సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం సాక్ష్యాధారాలు సేకరిస్తున్న క్రమంలో మరోసారి గోదాములో మంటలు రాగా.. ఫైరింజన్‌ను రప్పించి ఆర్పించారు. అనంతరం గోదాములో ప్రమాదం జరిగిన ప్రాంతాలు, వలస కార్మికులు నిద్రించిన గదుల్లో కొన్ని వస్తువులు సేకరించారు. పేలుడు, మండే స్వభావం ఉన్న వస్తువులు, ఇతర ఆధారాలు లభించేవరకు ప్రమాదానికి కచ్చితమైన కారణం తెలీదని పోలీసులు తెలిపారు

ప్రమాదం జరిగిన భవనం

క్లూస్‌ బృందాల పరిశీలన

ప్రమాదం తరువాత రెండోరోజు క్లూస్‌ బృందాలు గోదాములో అణువణువూ పరిశీలించాయి. గోదాము అంతటా సీసీ కెమెరాలుండడంతో వాటి డీవీఆర్‌లను సేకరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ యంత్రాంగం వచ్చి గోదాము ఏ స్థితిలో ఉంది? కూలిపోయేలా ఉందా? పరిశీలించారు. వివిధ ప్రభుత్వ విభాగాల అధికార సిబ్బంది ప్రమాద స్థలాన్ని సందర్శించి, వారికి అవసరమైన వివరాలు సేకరించారు.

రాజేశ్‌కుమార్‌, సికిందర్‌ రామ్‌, బిట్టు, సత్యేంద్రకుమార్‌(వరుసగా..)

సొంతూళ్లకు మృతదేహాలు...

ప్రమాదంలో సజీవ దహనమైన 11 మంది మృతదేహాలను వారి స్వస్థలాలకు గాంధీనగర్‌ ఠాణా అధికారులు విమానాల్లో గురువారం తరలించారు. తరలింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలను జిల్లా కలెక్టర్‌ శర్మన్‌ స్వయంగా పర్యవేక్షించారు. గాంధీ ఆసుపత్రికి గురువారం తెల్లవారుజామున 3 గంటలకు వచ్చిన ఆయన సికింద్రాబాద్‌ ఆర్డీవో, తహసీల్దారులను పిలిపించి అధికారిక ప్రక్రియ ముగింపజేశారు.
అనంతరం హైదరాబాద్‌ నుంచి పట్నాకు ఉదయం 8గంటలకు బయల్దేరిన విమానంలో ఆరు, మధ్యాహ్నం విమానంలో ఐదు మృతదేహాలను తరలించారు. మృతదేహాలతోపాటు సత్యేంద్ర సోదరుడు రాజేందర్‌, మరో వ్యక్తి వెళ్లారు. పట్నా నుంచి ధానాపూర్‌ మీదుగా చాప్రా జిల్లాకు మృతదేహాలను తీసుకెళ్లి సొంతూళ్లకు తరలించారు.

నోరులేని జీవిని పట్టించుకొనేవారేరి?

గాయపడ్డ శునకం

బోయిగూడలోని గోదాములో బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది కార్మికులతోపాటు ఓ శునకం నిద్రించింది. దాన్ని తాడుతో కట్టేసి వారంతా నిద్రకు ఉపక్రమించారు. మంటల ధాటికి ఆ తాడు తెగిపోవడంతో ప్రేమ్‌కుమార్‌తో పాటు శునకం కిటికీలో నుంచి దూకి తప్పించుకుంది. ఈ క్రమంలో దాని వెనుక భాగంతోపాటు కాలుకు గాయమై నడవలేక అవస్థలు పడుతోంది. ఆ మూగజీవిని ఎవరూ పట్టించుకోవడంలేదు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.