ETV Bharat / crime

మిస్టరీ వీడిన హత్య కేసు.. బావమరిదే హంతకుడు - బావమరిదే హంతకుడు

బావ మంచే కోరతాడు బావమరిది. కానీ నిజామాబాద్ జిల్లా​లో మాత్రం చావును కోరాడు ఓ వ్యక్తి. బావ​ను హతమార్చి.. మృతదేహాన్ని కాల్చేసి.. చేతులు దులుపుకున్నాడు. రంగంలోకి దిగిన పాలీసులు మిస్టరీని ఛేదించారు.

police cracked the mystery of a murder case in nizamabad
మిస్టరీ వీడిన హత్య కేసు.. బావమరిదే హంతకుడు
author img

By

Published : Mar 15, 2021, 9:46 PM IST

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కొప్పర్గ శివారులో.. ఇటీవల జరిగిన హత్య కేసు మిస్టరీ వీడింది. ఈనెల 11న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వ్యక్తి ​హత్యకు బావమరిదే కారణమని పోలీసులు నిర్ధరించారు. సోదరిని వేధింపులకు గురి చేయటంతో ఆగ్రహానికి గురైన ప్రకాశ్​.. బావ అశోక్​ను హతమార్చాడని పోలీసులు వెల్లడించారు.

మహారాష్ట్రలోని కర్ల ప్రాంతానికి చెందిన అశోక్.. బిచ్కుంద మండలానికి చెందిన నిందితుడి చిన్నమ్మ కూతురును పెళ్లాడి.. ఇల్లరికం వచ్చాడు. కొద్ది రోజులు బాగానే ఉన్న దంపతుల మధ్య.. కలహాలు చోటుచేసుకున్నాయి. అశోక్​.. భార్యను వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. సోదరిని తరచూ ఇబ్బందులకు గురి చేయడం చూసి ప్రకాశ్ తట్టుకోలేకపోయాడు.

రాయితో కొట్టి..

పథకం ప్రకారం.. ప్రకాశ్ తన భావను గ్రామ శివారుకి తీసుకెళ్లాడు. మద్యం తాగించి రాయితో అతడి తలపై బలంగా కొట్టాడు. మృతదేహాన్ని పెట్రోల్​తో​ కాల్చేసి.. చేతులు దులుపుకున్నాడు. నిందితుడిని రిమాండ్​కు తరలించినట్లు ఏసీపీ రామారావు తెలిపారు. హత్యకేసుని ఛేదించిన.. బోధన్ రూరల్ సీఐ రవీందర్ నాయక్, ఎస్సై సందీప్, సిబ్బందికి రివార్డ్​లు అందజేశారు.

ఇదీ చదవండి: బంగారం దొంగతనం చేశావని అవమానించడంతో కూలీ ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.