హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో గత నెల జరిగిన ఓ హత్య కేసు.. మిస్టరీ వీడింది. అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వృద్ధురాలి హత్యకు.. వరసకు సోదరుడయ్యే ఓ యువకుడే కారణమని నారాయణగూడ పోలీసులు నిర్ధరించారు. చేసిన దొంగతనం విషయం బయట పడుతుందనే కారణంతోనే ఘాతుకానికి పాల్పడినట్లు వారు వెల్లడించారు.
మృతురాలు జూలియట్ అంథోని(71).. తిలక్ రోడ్లో నివాసముండేది. గత నెలలో.. తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ.5 లక్షలు మాయమవ్వడం వల్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాబాయ్ కొడుకు.. జోసెఫ్ రిచర్డ్ (25)పై అనుమానం ఉన్నట్లు పేర్కొంది.
గొంతు నొక్కి.. నిప్పంటించి
చోరీకి పాల్పడ్డ జోసెఫ్.. సోదరి ఫిర్యాదుతో ఆగ్రహానికి గురయ్యాడు. దొంగతనం బయటపడకూడదనే ఉద్దేశంతో.. ఫిబ్రవరి 12న అర్ధరాత్రి జూలియట్ ఇంటికి వెళ్లాడు. గొంతు నొక్కి ఆమెను చంపేందుకు యత్నించాడు. స్పృహ కోల్పోయిన బాధితురాలిపై కిరోసిన్ పోసి.. నిప్పు అంటించి, అక్కడి నుంచి పరారయ్యాడు.
మృతురాలి మరో సోదరుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అనుమానంతో ఈ నెల 5న జోసెఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనే అసలు హంతకుడని తేల్చారు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించినట్లు నారాయణగూడ సీఐ రమేశ్ తెలిపారు.
ఇదీ చదవండి: అనుమానంతో భార్యను అతికిరాతకంగా చంపిన భర్త!