పోలీసు అధికారులు, సిబ్బంది.. విధులు నిర్వహించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ సూచించారు. కోహెడలో విధులు నిర్వహిస్తూ కొవిడ్ బారిన పడి మృతి చెందిన కానిస్టేబుల్ భీమయ్య(47) మృతి పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం అందుగులపేటకు చెందిన బైరినేని బీమయ్య.. నాలుగు రోజుల క్రితం కరోనాతో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో.. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రాణాలు విడిచాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మృతుడి కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి పరామర్శించారు సీపీ. డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చిన వెంటనే కరోనా టెస్ట్ చేయించుకోవాలని సిబ్బందికి సూచించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ సంఘం ఉపాధ్యక్షుడు రవీందర్ రెడ్డి, హుస్నాబాద్ డివిజన్ అడిషనల్ ఎస్పీ మహేందర్, సీఐ రఘుపతి రెడ్డి, కోహెడ ఎస్ఐ, సిబ్బంది.. బీమయ్య మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. అంత్యక్రియలకు డిపార్ట్మెంట్ తరఫున ఆర్థిక సహాయం చేశారు.
ఇదీ చదవండి: డంపింగ్ యార్డు వద్ద మృతదేహం లభ్యం..