హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలులో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్‌కు చెందిన 20 తూటాలున్న బ్యాగ్ మాయమైంది. ఏఆర్ కానిస్టేబుల్ రమేశ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆయన 303 తుపాకీకి సంబంధించి 20 తూటాలున్న బ్యాగ్ చత్తా బజార్ వద్ద కింద పడిపోయిందని తెలిపారు. మీర్‌చౌక్ పోలీసులకు కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా ఇస్మాయిల్ అనే వ్యక్తి బ్యాగ్ తీసుకున్నట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని బ్యాగ్‌లోని 20 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: Mansas trust: సంచయిత గజపతిరాజు నియామక జీవో రద్దు