నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరి మృతికి కారకులైన ఇద్దరు నిందితులను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. శేరిలింగంపల్లికి చెందిన చోటు ముంద, అతని అనుచరుడు సంతోశ్ వర్మ రెడీమిక్స్ వాహనాన్ని వేగంగా నడుపుతూ... గుల్‌మోహర్ కాలనీ వద్ద ద్విచక్ర వాహనం పై వెళ్తున్న బీహెచ్‌ఈఎల్ ఉద్యోగి అబ్దుల్లాను ఢీ కొట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అబ్దుల్లా మృతి చెందాడు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు... పూర్తి నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లనే ప్రమాదం జరిగిందని తేల్చారు. ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ చోటు, అతని అనుచరుడు సంతోశ్ వర్మను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరికి న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: Black Fungus: చికిత్సకు రూ.కోటిన్నర ఖర్చు.. కానీ!