Degree Student Anusha Death Case: ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా బద్వేలు డిగ్రీ కళాశాల విద్యార్థిని అనూష మృతికి కారణమైన గురు మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురుమహేశ్వర్ రెడ్డి, అనూష మధ్య పరిచయం ఉందని.. ఈనెల 19న ఇద్దరూ ద్విచక్ర వాహనంలో సిద్ధవటం కోటకు వెళ్లి వచ్చారని ఎస్పీ అన్బురాజన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. 20వ తేదీ తన బర్త్డే కోసం కళాశాలకు వచ్చే విధంగా అనూషను ఒప్పించాలని గురు మహేశ్వర్ రెడ్డి.. అనూష సోదరిని కోరినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
ఈ నెల 20వ తేదీన ఉదయం బద్వేలు నుంచి బస్సులో అనూష ప్రయాణించి ఉదయం 9.45 గంటలకు సిద్ధవటం కోటకు చేరుకుందని వివరించారు. అనూష నదిలోకి తానే దూకి ఆత్మహత్య చేసుకుందా.. ఇంకా ఎవరైనా తోశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. అనూష శరీరంపై ఎలాంటి గాయాలు లేవని నివేదికలో తేలిందన్న ఎస్పీ... మరోసారి ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత వివరాలను వెల్లడిస్తామన్నారు.
ఇవీ చదవండి: