సికింద్రాబాద్లోని లోతుకుంటలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ముగ్గురిని ఆబ్కారీ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కిలో గంజాయి, 10 ఎల్ఎస్డీ ట్యాబ్లెట్లు, 20గ్రాముల హషీష్ ఆయిల్, 5 గ్రాముల చరస్తో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న.. బిస్వజిత్ మత్తు పదార్థాలకు అలవాటుపడి తరచుగా గోవా వెళ్తుండేవాడు.
క్రమంగా గోవా నుంచి మత్తు పదార్థాలు తీసుకొచ్చి లోతుకుంట, అల్వాల్, సైనిక్ పురి ప్రాంతాల్లో విక్రయించడం మొదలుపెట్టాడు. బిస్వజిత్ వద్దకు వచ్చే అమర్ చంద్, బ్రియాన్ మార్క్ మత్తు పదార్థాలను కోనుగోలు చేసి ఇతరులకు అధిక ధరలకు విక్రయించేవారు. పక్కా సమాచారం అందుకున్న ఆబ్కారీ అధికారులు.. ముగ్గురినీ అరెస్ట్ చేశారు. వీరి వెనుక ఇంకెవరెవరు ఉన్నారనే దానిపై విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: Baby Dead: భార్యపై అనుమానంతో.. తొమ్మిది నెలల బాలుడి హత్య