ETV Bharat / crime

ప్రేమ పేరుతో బాలికపై అఘాయిత్యం.. ముగ్గురు అరెస్ట్ - పోక్సో చట్టం కేసు నమోదు

Rape on Minor Girl at karkhana : స్నాప్ చాట్ ద్వారా బాలికను పరిచయం చేసుకున్నాడు. ప్రేమించానని నమ్మించాడు. అది నిజమేనని... తెలిసీతెలియని వయసులో నమ్మింది ఆ బాలిక. ఇంకేం హోటల్ రూముకు తీసుకెళ్లి... మైనర్​పై రెండు సార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Rape on Minor Girl at karkhana, rape case
ప్రేమ పేరుతో బాలికపై అఘాయిత్యం
author img

By

Published : Mar 4, 2022, 11:58 AM IST

Rape on Minor Girl at karkhana : ప్రేమ పేరుతో బాలికను లొంగదీసుకొని... ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతడికి సహకరించిన ఇద్దరు వ్యక్తులపై కార్ఖానా పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్​కు తరలించారు. మలక్​పేట్ ప్రాంతానికి చెందిన ఆమన్ ఖాన్(26) ప్రైవేట్ ఉద్యోగి. అతడికి కార్ఖానాకు చెందిన ఓ బాలిక స్నాప్ చాట్ ద్వారా పరిచయమైంది. తరుచూ మాట్లాడుకోవడంతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆమెను ప్రేమిస్తున్నానని నమ్మించాడు.

Rape on Minor Girl at karkhana, rape case
నిందితుడు

Hyderabad rape case : హైదరాబాద్​ నగరంలోని రెండు హోటళ్లలో పనిచేసే ఇద్దరు ఉద్యోగుల ద్వారా... రూములు అద్దెకు తీసుకున్నాడని పోలీసులు తెలిపారు. అలా మైనర్​పై రెండు సార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడని వెల్లడించారు. బాలిక కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో... పోలీసులను ఆశ్రయించారు.

girl rape case updates : బాలిక తల్లిదండ్రులు కార్ఖానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఆమన్ ఖాన్​తో పాటు.. సహకరించిన మనోహర్ (30), నగూల్ మీరా(28)లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి... అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులను రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి: Inter Student Suicide : నీటిట్యాంక్‌లో దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.