ETV Bharat / crime

నగ్నంగా వీడియో కాల్​ చేసింది.. ఆ తర్వాత.. - mahabubabad latest news

ముందుగా ఫేస్​బుక్​ నుంచి ఓ అందమైన అమ్మాయి ఫ్రెండ్​ రిక్వెస్ట్​ పంపుతుంది. యాక్సెప్ట్​ చేశాక వెంటనే ఫోన్​ చేసి ముగ్గులోకి దింపుతుంది. ఆ తర్వాత నగ్నంగా వీడియో కాల్​ చేసి మనల్ని కూడా బట్టలు విప్పమని చెబుతుంది. అంతే టెమ్ట్​ అయి బట్టలు విప్పాక ఆమె అసలు రూపం బయటపడుతుంది. అప్పటివరకు రికార్డు చేసిన నగ్న వీడియోలను వాట్సాప్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాలో పోస్ట్​ చేస్తానంటూ బ్లాక్​ మెయిల్ చేస్తుంది. డబ్బులు పంపాలంటూ డిమాండ్​ చేస్తుంది. ఇలాంటి ఘటనే ఇప్పుడు తాజాగా మహబూబాబాద్​లో జరిగింది.

Phone call with nude video, nude video after that blackmail amount
నగ్న వీడియోలతో ఫోన్​ చేసింది..ఆ తర్వాత..
author img

By

Published : Apr 23, 2021, 10:04 PM IST

Updated : Apr 23, 2021, 10:42 PM IST

నగ్నంగా వీడియో కాల్​ చేసింది.. ఆ తర్వాత..

ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితమైన వలపు వల తరహా బ్లాక్ మెయిలింగ్ ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలకు పాకింది. ఈ వలలో మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పలువురు చిక్కుకున్నారు. ఒక వ్యక్తికి ఫేస్​బుక్​లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది, యాక్సెప్ట్ చేశాడు. తర్వాత కొద్ది సేపటికే వాట్సాప్ నుంచి ఓ వీడియో కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేస్తే అవతల వైపు ఓ యువతి నగ్నంగా కనిపిస్తూ మాటల్లోకి దించింది. బాధితుడిని కూడా బట్టలు విప్పి మాట్లాడమని కోరింది. ఇవతల వ్యక్తి బట్టలు విప్పక పోవడం వల్ల... పలుమార్లు ఫోన్ చేసి రకరకాల మాటలతో ఆ యువతి ఇవతలి వ్యక్తిని నగ్నంగా మారే విధంగా రెచ్చగొట్టింది. దీంతో బాధితుడు ఫోన్ కట్ చేశాడు.

బెదిరింపులు

అంతే కొద్దిసేపటికే అతని వాట్సాప్​కి ఒక వీడియో వచ్చింది. అందులో ఇంతకు ముందు నగ్నంగా ఉన్న యువతితో వీడియో కాల్ మాట్లాడుతుండగా రికార్డు చేసిన వీడియో వచ్చింది. అంతేకాదు వేరే వ్యక్తి బట్టలు విప్పి మాట్లాడిన కాల్​ని మార్ఫింగ్ చేసి పంపించింది. ఆ వీడియోను ట్విట్టర్, ఇన్​స్టాగ్రామ్, ఫేస్​బుక్, యూట్యూబ్​లలో అప్​లోడ్ చేస్తామని బెదిరించింది. అప్​లోడ్ చేయకుండా ఉండాలంటే రూ.10 వేలు వెంటనే తన అకౌంట్​కి పంపాలంటూ బ్లాక్ మెయిల్ చేసింది.

యువతి కాదు, యువకుడు

బ్లాక్ మెయిలింగ్​కు సదరు బాధితుడు బెదిరిపోకుండా వెంటనే మహబూబాబాద్ పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. అనంతరం జిల్లా సైబర్ సెల్​ను ఆశ్రయించాడు. దీంతో వారు పరిశీలించి కొన్ని వివరాలు అందజేశారు. ఫేస్​బుక్​లోని వివరాలు, నంబర్​ను చూసి వాట్సాప్ కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. వీడియో ఛాటింగ్​లో నగ్నంగా ఉన్న యువతి వాయిస్ సైతం లైవ్ వీడియో కాదని, రికార్డు అని, మాట్లాడింది యువతి కాదు, యువకుడని పేర్కొన్నారు.

రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయవద్దు

సెల్​టవర్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్​లో చూపిస్తుందని, ఇతర నంబర్ల ద్వారా ఫోన్ చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పట్టణ సీఐ వెంకటరత్నం పలు సూచనలు చేశారు. ఫేస్​బుక్​లో వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయవద్దని, ఫేస్ బుక్ ప్రొఫైల్​ని లాక్ చేసుకోవాలని, తద్వారా మన ఫ్రెండ్స్ తప్ప మరెవరూ మన వివరాలు చూసేందుకు వీలు పడదని అన్నారు. ఫేస్​బుక్​లో వ్యక్తిగత ఫొటోలు అప్​లోడ్ చేయవద్దని తెలిపారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్​ వస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఇదీ చూడండి : సహజీవనం చేశాడు.. 37లక్షలతో పరారయ్యాడు..

Last Updated : Apr 23, 2021, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.