ETV Bharat / crime

కారు పార్కింగ్​ వివాదం.. డాక్టర్​ను ఏం చేశారో తెలుసా!!

Attack on doctor in old city: తమ ఆసుపత్రి స్థలంలో పార్క్ చేసిన కారును తీయమనడమే ఆ డాక్టర్​ చేసిన పాపం. మమ్మల్నే కారుతీయమంటావా అంటూ ఆ డాక్టర్​పై విచక్షణారహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు... హైదరాబాద్​లోని పాతబస్తీలో కొందరు వ్యక్తులు. కారు పార్కింగ్​ విషయంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారి డాక్టర్​పై దాడి చేసే దాకా వెళ్లింది. దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదు కావడంతో ఇప్పుడు వైరల్​గా మారాయి.

Attack on doctor
Attack on doctor
author img

By

Published : Oct 14, 2022, 9:20 AM IST

Updated : Oct 14, 2022, 12:43 PM IST

Attack on doctor in old city: కారు పార్కింగ్ విషయంలో డాక్టర్​పై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన హైదరాబాద్​లోని పాతబస్తీలో జరిగింది. లాల్​దర్వాజా లోని ఓప్రైవేటు ఆసుపత్రి వద్ద కారు పార్కింగ్​ విషయంలో డాక్టర్​ ప్రశాంత్​కు ఆసుపత్రి పక్కింటి వారికి వాగ్వాదం జరిగింది. గొడవ కాస్త ముదిరి పక్కింటివారు డాక్టర్​పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుని భార్య ఫిర్యాదు మేరకు శాలిబండ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రశాంత్​ ఆరోగ్యం విషమంగా మారడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

"మా ఆస్పత్రి ముందు పక్కింటివారు కారు పార్క్ చేశారు. తీయమని చెప్పినందుకు ఆస్పత్రి లోపలికి వచ్చి నాభర్తపై దాడి చేశారు. గత కొన్ని రోజుల నుంచి పక్కింటివారు మా ఆస్పత్రి ముందే కారు పార్క్ చేస్తున్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు ఇబ్బందులు అవుతోందని చెప్పిన వినడం లేదు. ఈరోజు కారు తీయండి లేకుంటే పోలీసులకు కంప్లైంట్ చేస్తామంటే మాపైనే దాడి చేశారు. డాక్టర్ పరిస్థితి విషమంగా ఉంది. ఐసీయూలో చికిత్స పొందుతున్నారు".-నేహా, డాక్టర్​ ప్రశాంత్​ భార్య

కారు పార్కింగ్​ వివాదం.. వాళ్లు ఎంత పని చేశారో తెలుసా!!

ఇవీ చదవండి:

Last Updated : Oct 14, 2022, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.