Delhi Liquor Case Update: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నా పెనక శరత్ చంద్రరెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ సాగింది. విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు శరత్చంద్ర పిటిషన్‌పై.. వివరణ కావాలని ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్)కి నోటీసులు జారీ చేసింది.
ఈ సందర్బంలో ఈడీ తరుఫున హాజరైన అధికారులు శరత్ చంద్రారెడ్డి విచారణ పెండింగ్‌లో ఉందని కోర్టుకు తెలిపారు. ఆయనపై ఛార్జ్‌షీట్ ఇంకా దాఖలు చేయలేదని న్యాయస్థానానికి వివరించారు. ఇరువురి వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు.. విచారణను ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేసింది.
Binoy Babu Custody: మరో వైపు ఈ కేసులో శరత్ చంద్రారెడ్డితో పాటు మరో నిందితుడుగా ఉన్న బినోయ్ బాబు కస్టడీ గడువు నేటితో ముగియడంతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ఎదుట అధికారులు హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం జ్యుడీషయల్ కస్టడీని ఈనెల 19వ తేదీ వరకు పొడిగించారు. మరో వైపు ఈకేసులో నిందితులుగా ఉన్న విజయ్‌నాయర్, అభిషేక్ బోయినపల్లి బెయిల్ రద్దు పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో విచారణ సాగింది. నిందితులకు గత వారం విచారణ సందర్భంలో.. సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ.. నిందితులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు సీబీఐ అభ్యర్థన మేరకు ఈసారి బెయిల్‌కు నిరాకరించింది.
Bail Petition of Vijay Nayar and Abhishek Boinapalli: సీబీఐ తరుపున హాజరైన అధికారులు దర్యాప్తు ఇంకా సున్నితమైన దశలోనే ఉందని పేర్కొన్నారు. విచారణలో దక్షిణ భారతదేశం నుంచి దిల్లీకి రూ.30 కోట్ల నగదు వచ్చిందని.. అది దిల్లీలో ప్రముఖ వ్యక్తులకు చేరిందని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కేసును ఈనెల 22వ తేదీకి వాయిదా వేశారు.
ఇవీ చదవండి: