ద్విచక్రవాహనాలను దొంగలిస్తున్న ఇద్దరు నిందితులను పాతబస్తీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 9 లక్షల విలువ చేసే... 10 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఫారూఖ్ నగర్‌కు చెందిన సిరాజుద్దీన్, సులేమాన్ నగర్‌కు చెందిన హమీద్‌లు ఇద్దరు కలిసి చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు.
రాత్రి వేళల్లో నకిలీ తాళం చెవి ద్వారా వాహనాలను దొంగలిస్తున్నట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించామని దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్ తెలిపారు. వీరు ఫలక్ నామా, షాలీ బండ, చంద్రాయణ గుట్ట, కాలపత్తర్, బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డారని వెల్లడించారు.
ఇదీ చూడండి: ఉపాధి కోసం వచ్చి దొంగతనం.. నిందితుల అరెస్ట్!