ETV Bharat / crime

విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన.. చితబాదిన తల్లిదండ్రులు - వరంగల్ జిల్లా వార్తలు

Parents attack on teacher: పాఠాలు చెప్పాల్సిన గురువు కీచకుడిగా మారాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు. పాఠశాలకు వచ్చి అతన్ని చితకబాదారు. ఈ సంఘటన వరంగల్ జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది.

Parents attack on teacher
Parents attack on teacher
author img

By

Published : Aug 10, 2022, 5:33 PM IST

Parents attack on teacher: విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయున్ని తల్లిదండ్రులు చితకబాదారు. పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు కీచక టీచర్​పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లాకేంద్రంలోని ఎల్బీనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది.

నగరంలోని స్థానిక ఎల్బీనగర్​లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మనోహర్ అనే ఉపాధ్యాయుడు సాంఘిక శాస్త్రం బోధిస్తున్నారు. అతను అసభ్యంగా ప్రవర్తించడంపై విద్యార్థినులు వారి తల్లిదండ్రులకు వివరించారు. ఈ క్రమంలోనే మనోహర్ వైఖరిపై ప్రధాన ఉపాధ్యాయునికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోవడంతో ఏకంగా తల్లిదండ్రులే రంగంలోకి దిగారు.

విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయున్ని చితక బాదారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మనోహర్​ను అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయంపై ప్రధానోపాధ్యాయునికి తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే మొదటి తప్పిదంగా భావించి మన్నించాలని తల్లిదండ్రులకు చెప్పడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలలకు పంపించడమే తల్లిదండ్రులు చేసిన తప్పా అని పలువురు తల్లిదండ్రులు ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన మనోహర్​పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

విద్యార్థినులతో టీచర్ అసభ్య ప్రవర్తన.. చితబాదిన తల్లిదండ్రులు

ఇవీ చదవండి: జూరాలకు భారీగా వరద... 38 గేట్లు ఎత్తిన అధికారులు

రాఖీ స్పెషల్​ స్వీట్.. ఇంట్లో మీరే సింపుల్​గా చేసేయండిలా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.