ETV Bharat / crime

ORR road accident: పెద్ద అంబర్​పేట​ వద్ద రోడ్డు ప్రమాదం... దగ్ధమైన లారీ, కారు - రంగారెడ్డి జిల్లా క్రైమ్​ వార్తలు

ORR road accident: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట బాహ్య వలయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు పూర్తిగా, లారీ పాక్షికంగా దగ్ధం అయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కారు డ్రైవర్​కు తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ORR road accident
ORR road accident
author img

By

Published : Dec 4, 2021, 12:02 PM IST

Pedda amberpet road accident: ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన ఘటన రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్​పేట బాహ్య వలయ రహదారిపై చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా, లారీ పాక్షికంగా దగ్ధం అయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారుడు కారులో మంటలను చూసి డ్రైవర్​ను బయటకి తీయడంతో ప్రమాదం తప్పింది. హయత్​నగర్​ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. డ్రైవర్​కు తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు.

శంషాబాద్ నుండి ఘ‌ట్‌కేస‌ర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈసీఐఎల్ దమ్మాయిగూడాకు చెందిన మయూర్... శంషాబాద్ ఎయిర్​పోర్ట్​ వెళ్లి తిరిగి వస్తుండగా సిమెంట్ లోడుతో ఉన్న లారీని వెనక నుండి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

పెద్ద అంబర్​పేట​ వద్ద రోడ్డు ప్రమాదం...

ఇవీ చదవండి: Murder Attempt: కన్నతండ్రి కర్కశత్వం... వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడని పైశాచికత్వం

Honor Killing News : కులాంతర వివాహం చేసుకుంటుందని.. కుమార్తెను చంపిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.