ETV Bharat / crime

బీమా పేరుతో మోసం.. రూ.8 లక్షలు కొట్టేసిన సైబర్​ కేటుగాళ్లు - ఏపీ నేర వార్తలు

బీమా సొమ్ము ఇస్తామని చెప్పి ఆన్​లైన్ కేటుగాళ్లు ఓ మహిళను మోసం చేసిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా జార్జిపేటలో జరిగింది. ఆమెకు రావాల్సిన బీమా సొమ్ము ఆశ చూపి మహిళ నుంచి రూ.8 లక్షలు స్వాహా చేశారు.

insurance cyber crime in guntur
బీమా సొమ్ము ఇప్పిస్తామని మహిళను మోసగించిన సైబర్​ కేటుగాళ్లు
author img

By

Published : Mar 27, 2021, 8:04 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరు జిల్లాలో ఆన్​లైన్ మోసం వెలుగు చూసింది. బీమా సొమ్ము ఇస్తామని చెప్పి ఓ మహిళను మోసం చేశారు. జిల్లాలోని పట్టాభిపురం జార్జిపేటకు చెందిన వీణారాణి కుమారుడు పదినెలల క్రితం మృతి చెందాడు. అతడి పేరుమీద బీమా పాలసీలు ఉండటంతో.. ఆమె వివరాలను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. బీమా డబ్బులు మంజూరయ్యాయని.. సెక్యూరిటీగా కొటక్ మహీంద్ర బ్యాంకులో ఖాతా తెరిచి అందులో రూ.8 లక్షలు డిపాజిట్ చేయాలని నమ్మబలికారు.

వారి మాటలను నమ్మిన వీణారాణి రూ.8 లక్షలను వారు ఇచ్చిన మూడు ఖాతాలకు బదిలీ చేసింది. డబ్బు జమ చేసి నెలలు గడుస్తున్నా.. బీమా సొమ్ము తిరిగి రాకపోగా మరో రూ.3 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితురాలు మోసపోయానని గ్రహించింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నామని అరండల్​పేట పోలీసులు వెల్లడించారు.

ఇదీచదవండి: 'తీర్మానం చేసి నిధులు ఖర్చు చేసుకోవచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.