ETV Bharat / crime

Online Cricket Betting: ఎల్బీనగర్​లో క్రికెట్​ బెట్టింగ్​ ముఠా గుట్టురట్టు.. రూ.14.92 లక్షలు సీజ్​ - తెలంగాణ వార్తలు

హైదరాబాద్​ ఎల్బీనగర్​లో క్రికెట్​ బెట్టింగ్ నిర్వహిస్తున్న​ ముఠాను ఎస్​ఓటీ పోలీసులు అరెస్టు చేశారు (online cricket betting gang arrested ). వారి నుంచి రూ.14.92 లక్షల నగదు, లాప్​టాప్​, 8 సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ తెలిపారు.

cricket betting gang
cricket betting gang
author img

By

Published : Oct 26, 2021, 10:47 PM IST

హైదరాబాద్​ ఎల్బీనగర్​లో క్రికెట్​ బెట్టింగ్​ ముఠా గుట్టు రట్టయింది (cricket betting gang arrested at lbnagar). టీ-20 ప్రపంచకప్ మ్యాచ్​ల సందర్భంగా ఆన్​లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు (online cricket betting gang arrested ). నిందితుల నుంచి రూ.14.92 లక్షల నగదు, లాప్​టాప్​, 8 చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ నిర్వాహకుడితో పాటు.. 4 పంటర్లను ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

కొత్తపేటకు చెందిన శ్రీధర్.. కోఠిలో జనరల్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. ఏడాది కాలంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న శ్రీధర్... తన నలుగురు స్నేహితులను కలుపుకొని క్రికెట్ మ్యాచ్​ సందర్భంగా పందెం కాస్తున్నాడు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్​లు డౌన్​లోడ్​ చేసుకుని వాటి ద్వారా బెట్టింగ్​ నిర్వహిస్తున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం రావడంతో... ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టి నిందితుల ఇళ్లల్లో దాడి చేసి పట్టుకున్నారని మహేశ్ భగవత్ తెలిపారు. ఎవరైనా బెట్టింగ్​కు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్ భగవత్ హెచ్చరించారు.

ఎల్బీనగర్​లో క్రికెట్​ బెట్టింగ్​ ముఠా గుట్టురట్టు.. రూ. 14.92 లక్షలు సీజ్​

ఆన్​లైన్​ క్రికెట్​ బెట్టింగ్​, రమ్మి గేమ్​లపై బెట్టింగ్​లు జరుగుతున్నాయి. ఈ బెట్టింగ్​ల వల్ల చాలా మంది ఆర్థికంగా ఇబ్బందిపడుతున్నారు. పలువురు ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. జీవితాలను కాపాండేందుకు మేము ప్రయత్నిస్తున్నాము. బెట్టింగ్​లపై దాడులు నిర్వహిస్తున్నాము. ఈ మధ్యకాలంలో ఓ బెట్టింగ్​ రాకెట్​ను అరెస్టు చేశాం.యూకేకు సంబంధించిన యాప్​ ద్వారా బెట్టింగ్​ నిర్వహిస్తున్న గ్యాంగ్​ను అరెస్టు చేసి.. రూ.74 వరకు సీజ్​ చేశాం.

-మహేశ్​ భగవత్​, రాచకొండ సీపీ.

ఇదీ చూడండి: ప్రేమను ఒప్పుకోలేదనే కోపంతో ప్రియురాలి ఇళ్లు కాల్చేసిన ప్రేమికుడు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.