ETV Bharat / crime

ఆటో బోల్తా.. ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు - sangareddy latest crime news

సంగారెడ్డి జిల్లాలో ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

one-person-was-died-an-auto-overturned-near-a-gas-pipeline-in-ainol-suburb-of-sangareddy-district
ఆటో బోల్తా.. ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు
author img

By

Published : Jan 25, 2021, 12:23 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలంలో ఓ ఆటో బోల్తా పడింది. ఐనోల్ గ్రామ శివారు గ్యాస్ పైప్​లైన్​ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

అకస్మాత్తుగా..

ఐనోలు గ్రామ శివారులోని గ్యాస్ పైప్ లైన్ సమీపంలో పటాన్​చెరు వైపు వస్తున్న ఆటో ముందు చక్రం అకస్మాత్తుగా విరిగి పడటంతో ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ఉన్న ఏడుగురిలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

దర్యాప్తు..

మృతి చెందిన వ్యక్తి పటాన్​చెరు మండలం పెదకంజర్ల గ్రామానికి చెందిన యాదగిరిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో వడ్డే పల్లి గ్రామానికి చెందిన అక్షయ, లావణ్య, షాద్ నగర్​కు చెందిన మేఘమాల, మౌనిక , కౌలం పేటకు చెందిన దివ్యలుగా తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:శూలంతో పొడిచి.. డంబెల్​తో కొట్టి.. కన్నకూతుళ్లనే చంపేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.