ETV Bharat / crime

Land dispute: భూ తగాదాల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ - తెలంగాణ వార్తలు

వికారాబాద్ జిల్లా పూడురు మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య భూతగాదాలు భగ్గుమన్నాయి. పొలం హద్దుల విషయంలో చెలరేగిన ఘర్షణల్లో కర్రలు, రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

land dispute, land issue
భూతగాదా, పొలం హద్దు గొడవ
author img

By

Published : Jun 28, 2021, 8:46 AM IST

వికారాబాద్ జిల్లా పూడురులో భూతగాదాల కారణంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పొలం హద్దుల విషయంలో రెండు కుటుంబాలు... కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఇందులో ఒకరికి తీవ్ర గాయాలవగా.. వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి.

స్థానికంగా ఉన్న 55 సర్వే నంబరులోని పొలాన్ని బెన్నూరు కుటుంబం, అదే గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డికి అమ్మారు. ఈ పొలం విషయంలో ఇరు వర్గాల మధ్య కొద్దికాలంగా గొడవ జరుగుతుంది. ఇదే నంబరును ఆనుకొని ఉన్న 54 సర్వే నంబర్‌లో విజయ్ కుమార్ అనే వ్యక్తి ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా..... హద్దుల విషయంలో వెంకట్ రెడ్డి గొడవకు దిగారు. వాగ్వాదం పెరగటంతో దాడి చేసుకున్నారు.

ఇదీ చదవండి: భయం గుప్పిట్లో ముంపు బాధితులు.. పునరావాసం కోసం పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.