Road Accident in moinabad: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ సమీపంలోని తాజ్ హోటల్ వద్ద అర్ధరాత్రి చేవెళ్ల నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు.. కనకమామిడి వైపు వెళ్తున్న ఓ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రేమిక(16), సౌమ్య, అక్షయ కిందపడిపోయారు.
ప్రేమిక తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన ఇద్దరికి కూడా గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు అమ్మాయి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మద్యం సేవించి కారును అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని మొయినాబాద్ పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఇదీ చదవండి:
పెళ్లికి వెళ్లి విగతజీవులుగా.. రోడ్డు ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి