ETV Bharat / crime

లారీని ఢీకొట్టిన కారు... ఓ వ్యక్తి మృతి, ఆరుగురికి గాయాలు - telangana varthalu

లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టిన ఘటన మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా... మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

లారీని ఢీకొట్టిన కారు... ఓ వ్యక్తి మృతి, ఆరుగురికి గాయాలు

author img

By

Published : Mar 7, 2021, 10:12 PM IST

హైదరాబాద్‌ శివారులోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మేడ్చల్​ జిల్లా ఘట్‌కేసర్‌ పీఎస్​ పరిధిలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఉన్న టోల్‌ ప్లాజా సమీపంలో.. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. కారు నడుపుతున్న కోట్ల పాపయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

పెద్ద అంబర్‌పేట నుంచి శామీర్‌పేట వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న ఘట్‌కేసర్‌ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని గాయపడ్డ వారిని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఏపీలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందినవాడని గుర్తించినట్లు ఘట్‌కేసర్‌ సీఐ ఎన్‌.చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: భీంగల్ మార్కెట్​లో వ్యాన్ బీభత్సం... ఇద్దరికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.