కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ చెక్ పోస్ట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బోధన్‌కు చెందిన లక్ష్మీ నారాయణ వరికోత మిషన్ యజమాని. దాని డ్రైవర్ సురేష్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై బోధన్ వెళ్తున్నారు. గుర్తు తెలియని వాహనం వారిని ఢీ కొట్టడంతో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ సురేష్‌ను చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: కూల్‌డ్రింక్ అనుకుని పురుగుల మందు తాగేశారు