శుభకార్యానికి వెళ్లొస్తుండగా లారీ, ద్విచక్రవాహనం ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం చింతలకుంట తండా స్టేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రత్నవరం గ్రామానికి చెందిన వెలుగు కరుణాకర్ మామిడాల గ్రామంలో ఓ విందుకు హాజరై... తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. శవపరీక్ష కోసం మృతదేహాన్ని తుంగతుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు