నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజీ వద్ద గురువారం రాత్రి జరిగిన ప్రమాద ఘటనలో ఇవాళ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే 9 మంది మృత్యువాత పడగా... హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వెంకటమ్మ అనే గృహిణి తుదిశ్వాస విడిచారు.
దేవరకొండ మండలం చింతబావి గ్రామానికి చెందిన 20 మంది ప్రయాణిస్తున్న ఆటోను పెద్దఆడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజీ సమీపంలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ఘటనాస్థలిలో, ఇద్దరు హైదరాబాద్లో, మరొకరు దేవరకొండ ఆస్పత్రిలో తనువు చాలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమించగా... వారికి హైదరాబాద్లో చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయాల పాలైన వెంకటమ్మను.. హైదరాబాద్ తరలించినా ప్రాణాలు దక్కలేదు.
సంబంధిత కథనాలు: మాటలకందని విషాదం... చింతబావిలో కన్నీటి సంద్రం!