ETV Bharat / crime

3 పాఠశాల బస్సులు దగ్ధం.. ఒకరు సజీవదహనం - narayanapet district latest news

నారాయణపేట జిల్లా మక్తల్​ పట్టణంలో ఓ ప్రైవేటు పాఠశాల బస్సులకు మంటలు అంటుకున్నాయి. తేనెటీగలను తరిమేందుకు బస్సుల్లో నిప్పుపెట్టగా.. ప్రమాదవశాత్తు వ్యాపించాయి. ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా.. మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. 3 బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి.

one man died in fire accident at narayanapet district a
పాఠశాల బస్సులకు మంటలు.. ఒకరు సజీవదహనం
author img

By

Published : Mar 20, 2021, 7:56 PM IST

Updated : Mar 20, 2021, 9:49 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో పాఠశాల బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్‌కు చెందిన 3 బస్సులకు నిప్పంటుకుని దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. మరొకరు తప్పించుకున్నారు. మృతుడు మక్తల్‌కు చెందిన మహదేవ్‌గా గుర్తించారు.

అసలు ఏం జరిగిందంటే..

పాఠశాలకు చెందిన బస్సుల్లో తేనెటీగలు ఉండటంతో యాజమాన్యం బుడగ జంగాలకు చెందిన మహదేవ్​తో పాటు మరో వ్యక్తికి తేనెటీగలను తొలగించాలని చెప్పారు. ఈ ప్రయత్నంలో భాగంగా బస్సులో నిప్పు పెట్టి తేనెటీగలను తరిమి కొట్టేందుకు యత్నించగా.. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. చూస్తుండగానే మూడు బస్సులకూ వ్యాపించాయి. ఘటనలో మహదేవ్ బస్సులోనే చిక్కుకుని, ఆగ్నికి ఆహుతయ్యాడు. మరో వ్యక్తి తప్పించుకున్నాడు.

స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సహాయంతో మంటలను ఆర్పివేశారు. మహదేవ్​​ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు మక్తల్​ సీఐ శంకర్​ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: తెలంగాణ భవన్​లో అగ్నిప్రమాదం.. తప్పిన ఆస్తినష్టం

Last Updated : Mar 20, 2021, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.