ETV Bharat / crime

బైక్​ను ఢీ కొట్డిన లారీ.. భర్త మృతి.. భార్యకు తీవ్రగాయాలు - One killed in road accident in Mahabubabad district

మహబూబాబాద్ జిల్లా బొద్దుగొండ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళుతోన్న దంపతులను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి.

road accident in mahabubabad district
బొద్దుగొండ గ్రామంలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Apr 1, 2021, 4:31 PM IST

ఓ ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టడంతో భర్త మృతిచెందగా... భార్య తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొద్దుగొండ శివారులో జరిగింది. వరంగల్ గ్రామీణ జిల్లా ఖానాపురం మండలం నాజీ తండాకు చెందిన రాంచంద్రు, అతని భార్య కమలమ్మ మహబూబాబాద్​లోని బంధువు చనిపోవడంతో అక్కడికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం గురువారం తెల్లవారు జామున ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు.

ఈ క్రమంలో బొద్దుగొండ గ్రామ శివారుకు చేరుకోగానే వారి వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రామచంద్రు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డ కమలమ్మను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: 'ప్రేమ పేరుతో పెళ్లి.. ఆ తర్వాత వ్యభిచారానికి ఒత్తిడి!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.