ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం తనికెళ్ల గ్రామంలోని లక్ష్య ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనాన్ని ఎదురుగా వస్తున్న లారీ వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
జిల్లాలోని వైరా మండల కేంద్రంలో గల బ్రాహ్మనపల్లి కాలనీకి చెందిన కోట బాబు (30) ఖమ్మం పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఉద్యోగరిత్యా రోజూ వైరా నుంచి ఖమ్మం వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఈ రోజు కూడా ఆసుపత్రికి వెళ్లడానికి ఇంటి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. తనికెళ్ల గ్రామ సమీపంలోకి రాగానే ఖమ్మం నుంచి వైరా వైపు వెళుతోన్న లారీ అతడు ప్రయాణిస్తోన్న వాహనాన్ని వేగంగా ఢీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: బంజారాహిల్స్ పీఎస్‌లో సీఐ, ఎస్ఐ సహా 11 మంది పోలీసులకు కరోనా