జాతీయ రహదారిపై డీసీఎం, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. చెన్నూరు మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన శేఖర్, మరో వ్యక్తి.. ట్రాక్టర్‌పై చెన్నూర్ వైపు వస్తుండగా కోటపల్లి వైపు వస్తున్న డీసీఎం ఢీ కొట్టింది.
ఘటనలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికీ తీవ్రగాయాలు కాగా వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శేఖర్ మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి కన్నుమూత