మహబూబాబాద్‌కు చెందిన ఆనందాచారి అనే వృద్ధుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఖమ్మంలోని ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం రాగా.. కరోనా పరీక్ష నివేదిక సమర్పించాలని వైద్యులు సూచించారు.
కొవిడ్ పరీక్ష కోసం పాత బస్టాండ్ వద్ద ఉన్న పరీక్షా కేంద్రానికి వెళ్లిన ఆనందాచారి తన వంతు కోసం వేచిచూస్తూ అక్కడే మృతి చెందాడు. అతని వెంట ఉన్న భార్య, బంధువులు మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
- ఇదీ చదవండి మీ చిన్నారులు ఏం చూస్తున్నారో.. ఓ కన్నేయండి!