ETV Bharat / crime

కరోనాతో వృద్ధురాలు మృతి.. జేసీబీతో ఖననం - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రంలో మొదటి కరోనా మరణం నమోదైంది. కొన్ని రోజులుగా కొవిడ్​తో పోరాడుతున్న వృద్ధురాలు బోయపల్లి సోమలక్ష్మి(74) ఈ రోజు మృతి చెందారు. మృతురాలి బంధువులు పీపీఈ కిట్లు ధరించి జేసీబీ సహాయంతో ఖననం చేశారు.

Corona deaths, addagudur news
Corona deaths, addagudur news
author img

By

Published : May 14, 2021, 10:47 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రంలోని మర్రిగడ్డలో వృద్ధురాలు బోయపల్లి సోమలక్ష్మి(74) మృతి చెందారు. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడి శుక్రవారం తుది శ్వాస విడిచారు. ఈమెకు కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. సోమలక్షి మరణించడంతో కొడుకు మల్లశ్​కు కరోనా పరీక్ష నిర్వహించగా పాజిటివ్ రావడం వల్ల హోం ఐసోలేషన్​లో ఉంచారు. మృతురాలి బంధువులు పీపీఈ కిట్లు ధరించి జేసీబీ సహాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. అడ్డగూడూర్ మండల కేంద్రంలో ఇది మొదటి కరోనా మరణంగా నమోదైంది.

ప్రజలు ఇప్పటికైన నిర్లక్ష్యం వదలి లాక్​డౌన్​కు సహకరించాలని స్థానిక సర్పంచ్ బాలెంల త్రివేణి దుర్గయ్య, ఎంపీటీసీ పెండల భారతమ్మలు సూచించారు. అవసరం ఉంటేనే తప్ప బయటకు రావద్దన్నారు. ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇదీ చూడండి: పిడుగు పడి ఇద్దరు రైతులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.