ETV Bharat / crime

Old Parents Protest: చీకటి గదిలో బంధించి మూడేళ్లుగా చిత్రహింసలు.. వృద్ధ దంపతుల న్యాయపోరాటం

Old Parents Protest: రాజధాని నగరంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. మూడేళ్లుగా వృద్ధ దంపతులను వేధిస్తున్న బాగోతం బయటపడింది. కన్న కొడుకే వారిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి భార్యతో కలిసి చిత్రహింసలకు గురిచేశారు. కుమారుడు, కోడలు వేధింపులను భరించలేక చివరికి కలెక్టర్​ను ఆశ్రయించారు.

author img

By

Published : Jun 28, 2022, 7:07 PM IST

Old Parents Protest
మూడేళ్లుగా కొడుకు, కోడలు వేధింపులు

Old Parents Protest: హైదరాబాద్​లోని ఎల్బీనగర్ డివిజన్ మన్సూరాబాద్‌ పరిధిలోని శ్రీరామ్​నగర్​లో ఈ ఘటన జరిగింది. కుమారుడు, కోడలు తమను తమ ఇంటి నుంచి వెళ్లగొట్టారని వృద్ధ దంపతులు కలెక్టర్​ను ఆశ్రయించారు. చీకటి గదిలో బంధించి హింసించారని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా కావేటి కౌసల్యాదేవ, లింగమయ్య అనే వృద్ధ దంపతులు తమను తమ చిన్న కుమారుడు, కోడలు తమను హింసిస్తున్నారని వాపోయారు. వారి వేధింపులు భరించలేక కలెక్టర్​ను కలిశారు.

దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ ఇంటిని వృద్ధులకు అప్పగించాలని ఆర్టీవో, తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇంటిని ఖాళీ చేయించి 10 తులాల బంగారు ఆభరణాలు, ఫిక్స్​డ్​ డిపాజిట్ల పత్రాలు వృద్ధులకు అప్పజెప్పాలని అధికారులకు సూచించారు. దీంతో వృద్దులతో సహా రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇంటికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఇంటికి తాళం వేసి కొడుకు, కోడలు పరారయ్యారు.

మేమే ఇళ్లు కట్టుకున్నాం. మమ్మల్ని నా కొడుకు, కోడలు నానా బాధలు పెట్టారు. మూడేళ్ల నుంచి ఇది జరుగుతుంది. మేం ఓల్డ్ ఏజ్ రూమ్​లో ఉంటున్నాం. కలెక్టర్, ఆర్డీవో మాకు సాయం చేసిండ్రు. ఇవాళ మాకు మా ఇల్లు వస్తదనుకున్నాం. కానీ మా కొడుకు, కోడలు ఇద్దరు పారిపోయిండ్రు.

- కావేటి కౌసల్యాదేవి, బాధితురాలు

మా నాన్న, అమ్మ, బ్రదర్ ఒక్కటే చోట ఉండేవారు. మా బ్రదర్ పెద్ద క్రిమినల్. 2006లో ప్రాపర్టీ డివైడ్ చేశాం. ఒపెన్ ప్లేస్ ఉంటే నేను ఇల్లు కట్టుకున్నా. దానిని కూడ అతనికే ఇచ్చా. అయిప్పటికీ తల్లితండ్రులను వేధించాడు. మేం అడిగితే మాపై కేసులు వేసి అసభ్యకరంగా మాట్లాడుతాడు. నేను ఐదేళ్లు ఇబ్బందులు పడ్డా. అందుకే మేం పట్టించుకోలేదు. ఎవరు వచ్చినా అసభ్యకర మాటలే.

-కావేటి చంద్రశేఖర్, బాధితురాలి పెద్ద కుమారుడు

ఇంటి ముందు బైఠాయించిన వృద్దదంపతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కూతురు కాగా అందరికీ వివాహం జరిగింది. కుమారుడు కోడలు ఇంటి సమీపంలోనే ఉంటున్నారు. ఇప్పుడు దంపతులు ఉంటున్న ఇంట్లో చిన్న కుమారుడు రాజశేఖర్ కోడలు తమను గత మూడేళ్లుగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. చిన్న కుమారుడు రాజశేఖర్ కుటుంబ సభ్యులపై ఆస్తి తగాదాలు ఉన్నట్లు తెలుస్తోంది.

గత సెప్టెంబర్​లో కావేటి కౌసల్యదేవి, లింగమయ్య దంపతులు చిన్న కుమారుడితో ప్రాణహాని ఉందని నాతో చెప్పారు. ఈ విధంగా వేధిస్తున్నారని తెలిసిన వెంటనే నేను వాళ్ల ఇంటికి వెళ్లాను. అప్పటికే బంధుమిత్రుల సమక్షంలోనే దంపతులను బెదిరించారు. లింగమయ్య తనకు ప్రాణహాని ఉందని నాతో చెప్పారు. వెంటనే ఎల్బీనగర్​ పోలీసులకు సమాచారం ఇచ్చాను. కేసు నమోదు చేశాం. వాళ్లకు ప్రొటెక్షన్ కావాలని కలెక్టర్​ను ఆశ్రయించాం. ఇవాళ స్పందించిన కలెక్టర్​ వెంటనే వారంలోగా ఇంటిని వృద్ధ దంపతులకు ఇవ్వాలని ఆదేశించారు.- గీతారెడ్డి, హుమన్ రైట్స్ పీపుల్ వాచ్ కౌన్సిల్ అధ్యక్షురాలు

చీకటి గదిలో బంధించి మూడేళ్లుగా చిత్రహింసలు.. వృద్ధ దంపతుల న్యాయపోరాటం

ఇవీ చదవండి:

10th Class Results: ఈ నెల 30న పదో తరగతి ఫలితాలు..

సముద్రంలో ల్యాండింగ్​ ఫెయిల్.. హెలికాప్టర్ కూలి నలుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.