ETV Bharat / crime

suspicious death: సిద్దిపేట జిల్లాలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతులు మృతి - అనుమానాస్పద స్థితిలో

సంతానం లేకపోయినా బంధువుల అమ్మాయిని పెంచుకున్నారు. ఆరేళ్ల క్రితమే ఆమెకు వివాహం కూడా చేశారు. ఏమైందో తెలియదు కానీ అన్యోన్యంగా ఉండే ఆ వృద్ధ దంపతులు విగతజీవులుగా కనిపించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్ మండలం తీగుల్ గ్రామంలో జరిగింది.

suspicious death
అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతులు మృతి
author img

By

Published : Mar 14, 2022, 4:29 PM IST

అనుమానాస్పద స్థితిలో వృద్ధ దంపతులు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్​పూర్ మండలం తీగుల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన స్వర్గం సత్యనారాయణ(65), బాలమణి(60) దంపతులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్​ టీం జాగిలాలతో ఆధారాలు సేకరించారు.

మృతి చెందిన దంపతులకు సంతానం లేకపోడంతో సత్యనారాయణ మరదలు కూతురును దత్తత తీసుకున్నారు. ఆరేళ్ల కిందట ఆమె వివాహం కూడా జరిపించారు. గ్రామంలోని మృతుని అన్న దత్తత కుమారుడు శ్రీనివాస్ వీరి ఇంటి పక్కనే నివాసముంటున్నారు. శ్రీనివాస్ ఆదివారం సాయంత్రం బంధువుల వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు.

ఆ మరుసటిరోజే గ్రామానికి చెందిన కొందరు ఆ ఇంటి వైపు వెళ్లగా వృద్ధ దంపతులు విగతజీవులుగా పడివుండటాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా సమగ్ర దర్యాప్తు చేపడతామని ఏసీపీ రమేశ్ తెలిపారు.

వృద్ధ దంపతులు వారి ఇంట్లో గత రాత్రి అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నారు. ఉదయం ఎనిమిది గంటలైనా వారు బయటికి రాకపోవడంతో స్థానికులు చూసి మాకు సమాచారం ఇచ్చారు. దంపతులిద్దరూ అనుమానాస్పద స్థితిలోనే మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశాక చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

- రమేశ్, గజ్వేల్ ఏసీపీ

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.