వృద్ధాప్యంలోనూ కలిసి జీవిస్తున్న దంపతులు ఒకే రోజు మృతి చెందారు. భార్య మృతిని తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైన భర్త.. గంటల వ్యవధిలోనే తానూ ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో జరిగింది.
పెద్దముప్పారం గ్రామానికి చెందిన అలువాల పెద్దరామయ్య(85)-అలువాల చెన్నమ్మ(75) దంపతులు. వీరికి సంతానం లేదు. రామయ్య వృద్ధాప్యానికి తోడు కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. భర్త మంచాన పడినప్పటినుంచి.. చెన్నమ్మే అతనికి అన్ని రకాల సపర్యలు చేస్తోంది.
ఇటీవలే అనారోగ్యానికి గురైన చెన్నమ్మ.. మంగళవారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది. తీవ్ర మనోవేదనకు గురై.. రెండు గంటల వ్యవధిలో అతడు సైతం మృతి చెందాడు. వృద్ధ దంపతుల మృతితో.. గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడి సోదరుడి కుటుంబ సభ్యులు.. వారికి అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: కిడ్నాపర్‌గా భావించి చితకబాదారు.. చివరకు విషయం తెలిసి.!