హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడి చేశారు. కేరళలోని అటవీ ప్రాంతాల్లో బఫర్ జోన్ల ఏర్పాటు విషయంలో రాహుల్ జోక్యం చేసుకోవడం లేదని నిరనసకు దిగిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. 80 నుంచి 100 మంది కార్యకర్తలు రాహుల్ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు.
ఎస్ఎఫ్ఐ కార్యకర్తల దాడిని నిరసిస్తూ... హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయంపై ఎన్ఎస్యూఐ కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ముందస్తు జాగ్రత్తగా కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి..