నిషేధిత గుట్కాను విక్రయిస్తున్న బోయిన్‌పల్లికి చెందిన మంగీలాల్ సోనీ అనే వ్యక్తిని ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పాన్‌షాపు, జనరల్ స్టోరుల్లో వాటిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడి నుంచి రెండు లక్షల విలువైన పొగాకు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్ జోధ్‌పూర్ ప్రాంత వాసి మంగీలాల్ సోని అనే వ్యక్తి నగరంలోని బోయిన్‌ల్లిలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన కొంతమందితో కలిసి నిషేధిత గుట్కా ప్యాకెట్లు సరఫరా చేసే ఏజెంటుగా మారినట్లు పేర్కొన్నారు.
హైదరాబాద్ లక్ష్యంగా..
హైదరాబాద్‌ను లక్ష్యంగా చేసుకుని పాన్‌షాప్, కిరాణా స్టోర్లలో అవసరమైన వారికి నిషేధిత గుట్కాను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. బోయిన్‌పల్లిలో ఓ దుకాణంలో గుట్కా ప్యాకెట్లు, మరికొన్ని మత్తుపదార్థాలు విక్రయిస్తుండగా అతన్ని ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గతంలోనే ఇతనిపై రెండు కేసులు ఉన్నట్లు గుర్తించారు. నిందితుడు నుంచి వివిధ రకాల బ్రాండ్లకు చెందిన పొగాకు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి బోయిన్పల్లి స్టేషన్ పోలీసులకు అప్పగించారు.
ఇదీ చూడండి: ప్రజాప్రతినిధులకు సమన్లు.. ఎందుకంటే..?