ETV Bharat / crime

Nizamabad Gang Rape case : గ్యాంగ్​రేప్​ కేసులో కీలక విషయాలు.. అసలేం జరిగిందంటే? - nizamabad gang rape case

తెలిసిన వాడేనని నమ్మి వెంటవెళ్లింది. తన స్నేహితులేనని చెబితే వారితో మాట్లాడింది. కలిసి భోజనం చేద్దామంటే సరేనంది. భోజనంతో పాటు మద్యంకూడా సేవించింది. అందరూ మనవాళ్లేనని నమ్మి వెళ్తే.. మృగాళ్లలా ఆమెపై అఘాయిత్యాని(Nizamabad Girl Gang Rape case)కి పాల్పడతారని ఊహించలేకపోయింది. సామూహిక అత్యాచారాని(Nizamabad Girl Gang Rape case)కి గురై దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆమెను స్థానికుల సమాచారంతో పోలీసులు గుర్తించారు. వెంటనే సఖి కేంద్రానికి తరలించి.. ఈ అరాచకానికి పాల్పడ్డవారిని అరెస్టు చేశారు. నిజామాబాద్​లో యువతిపై జరిగిన సామూహిక అత్యాచారాని(Nizamabad Girl Gang Rape case)కి సంబంధించిన విషయాలను సీపీ కార్తికేయ వెల్లడించారు.

Nizamabad Gang Rape case
Nizamabad Gang Rape case
author img

By

Published : Sep 30, 2021, 1:48 PM IST

Updated : Sep 30, 2021, 2:23 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన నిజామాబాద్ యువతిపై సామూహిక అత్యాచారం(Nizamabad Girl Gang Rape case) కేసులో కీలక విషయాలను సీపీ కార్తికేయ వెల్లడించారు. తెలిసిన వ్యక్తితో బయటకు వెళ్లిన యువతిపై.. అతడు, అతడి స్నేహితులు అఘాయిత్యాని(Nizamabad Girl Gang Rape case)కి పాల్పడ్డారని తెలిపారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకున్నట్లు చెప్పారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలించినట్లు వివరించారు.

బుధవారం అర్ధరాత్రి ఒంటిగంటకు డయల్​ 100కు ఓ యువతిపై కొందరు వ్యక్తులు అఘాయిత్యాని(Nizamabad Girl Gang Rape case)కి పాల్పడుతున్నట్లు కాల్ వచ్చిందని సీపీ చెప్పారు. వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఘటనాస్థలికి వెళ్లే సరికి అక్కడ 18 ఏళ్ల యువతి ఉందని తెలిపారు. ఏం జరిగిందో చెప్పే స్థితిలో ఆ యువతి లేకపోవడం వల్ల మొదట ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అనంతరం సఖి కేంద్రానికి పంపి.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు వివరించారు.

"ఈ నెల 28న నవీన్ కుమార్ అనే తెలిసిన వ్యక్తితో యువతి బయటకు వెళ్లింది. వాళ్లు కాసేపు నిజామాబాద్​ చుట్టుపక్కల తిరిగారు. అనంతరం నవీన్ స్నేహితులు ఇద్దరు వారితో కలిశారు. అందరు కలిసి ఓ చోటుకు వెళ్లారు. అక్కడ బిర్యాని తిని మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వాళ్లంతా.. నిజామాబాద్​ నగరంలో నిర్మాణంలో ఉన్న ఓ ఆస్పత్రి భవనం వద్దకు చేరారు. అక్కడికి మరో ముగ్గురు స్థానిక వ్యక్తులు వచ్చారు. మొత్తం ముగ్గురు వ్యక్తులు యువతిపై అత్యాచారం(Nizamabad Girl Gang Rape case) చేశారు. మరో ముగ్గురు వారికి సహకరించారు. పక్కనే షాపింగ్​మాల్ వద్ద ఉన్న వారు వీళ్లను గమనించారు. వెంటనే వారు డయల్ 100కు కాల్ చేశారు. అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సఖి కేంద్రానికి పంపి.. మహిళా అధికారితో మాట్లాడించాం. కాసేపటికి తేరుకున్నాక ఆమె జరిగిన విషయమంతా చెప్పింది. బాధితురాలు చెప్పిన అంశాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులను, ఉదయం ఒకరిని అరెస్టు చేశాం. ఆరుగుర్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్​కు తరలించాం."

- కార్తికేయ, నిజామాబాద్ సీపీ

ఈ అరాచకాని(Nizamabad Girl Gang Rape case)కి మొత్తం ఆరుగురు వ్యక్తులు పాల్పడ్డారని సీపీ కార్తికేయ తెలిపారు. వారు.. నిజామాబాద్​కు చెందిన నవీన్ కుమార్, భాను ప్రకాశ్, కరీమ్, చరణ్, గంగాధర్, చంద్రశేఖర్​లుగా గుర్తించినట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలు నగరంలో పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడతామని సీపీ చెప్పారు. బస్టాండ్​ పరిధిలో మరింత నిఘా పెంచుతామని స్పష్టం చేశారు. ఆడవాళ్లపై అఘాయిత్యాలను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.

Last Updated : Sep 30, 2021, 2:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.