ETV Bharat / crime

భర్త కారుకు జీపీఎస్‌...స్నేహితునితో సంబంధం... హత్యకు సుపారీ! - నేర వార్తలు

New Type of Crime in Hyderabad: చేతులకు మట్టి అంటకుండా మట్టుబెట్టడం... కుటుంబ సభ్యులకు కూడా అనుమానం రాకుండా చంపేయడం వంటి నేరాలు హైదరాబాద్‌లో కొత్త తరహాలో జరుగుతున్నాయి. రూ.కోట్లు కొట్టేసేందుకు, వివాహేతర సంబంధాల్లో అడ్డు తొలగించేందుకు షార్ప్‌ షూటర్లను రప్పిస్తున్నారు...కిరాయి హంతకులతో రూ.లక్షల్లో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. హత్యలు జరిగినప్పుడు పోలీస్‌ పరిశోధనలో ఇవి బయటపడ్డం... కొందరు బాధితులే పోలీసుల దృష్టికి తీసుకురావడంతో మరికొన్ని వెలుగు చూస్తున్నాయి.

New Type of Crime in Hyderabad:
నేరాలు
author img

By

Published : Mar 23, 2022, 8:49 AM IST

Updated : Mar 23, 2022, 9:30 AM IST

New Type of Crime in Hyderabad: భాగ్యనగరంలో ఈ మధ్య కొత్త తరహాలో నేరాలు జరుగుతున్నాయి. కొందరు రూ. కోట్లు కొట్టేసేందుకు, మరికొందరు వివాహేతర సంబంధాల్లో అడ్డు తొలగించేందుకు షార్ప్ షూటర్లను రప్పిస్తున్నారు. ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఘటనలను చూద్దాం. ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలో కొద్దిరోజుల క్రితం ఇద్దరు వ్యక్తులను సుపారీ తీసుకున్న హంతకులు దారుణంగా కాల్చి చంపారు. తాజాగా తన భర్తను చంపించేందుకు ఎల్బీనగర్‌లో ఉంటున్న మహిళ ప్రియుడి ద్వారా నల్గొండ జిల్లాకు చెందిన రౌడీషీటర్‌కు రూ.5లక్షలు సుపారీ ఇప్పించింది.

భర్త కారుకు జీపీఎస్‌...

ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలోని మన్సూరాబాద్‌లోని మధురానగర్‌లో ఉంటున్న వెంకటేష్‌, హరిత వివాహేతర బంధాన్ని కొన్నేళ్ల నుంచి కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారం వెలుగుచూడ్డంతో హరిత భర్త భాస్కర్‌ సరస్వతి నగర్‌కు మకాం మార్చాడు. అక్కడికి వెళ్లినా హరిత, వెంకటేశ్‌లు ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. ఇసుక వ్యాపారం చేస్తున్న భాస్కర్‌ ఎక్కువగా రాత్రి వేళల్లో బయటకు వెళ్తుండడంతో అతడి కారుకు రహస్యంగా జీపీఎస్‌ను అమర్చారు.

భాస్కర్‌ బయటకు వెళ్లగానే వెంకటేష్‌ రహస్యంగా హరిత ఇంటికి వచ్చేవాడు. ఇరుగు, పొరుగు వారు భాస్కర్‌కు ఈ విషయాన్ని చెప్పడంతో అతడు హరితతో గొడవపడ్డాడు. దీంతో ఆమె తన భర్తను చంపేయ్యాలంటూ వెంకటేష్‌కు చెప్పింది. తొలుత ఒక్కతే ఇంట్లోంచి వెళితే తర్వాత భాస్కర్‌ను చంపిస్తానని అతడు చెప్పాడు. పథకంలో భాగంగా ఈనెల 16న ఆమె ఇంట్లోంచి వెళ్లిపోయింది. తరువాత ఈ ప్రణాళిక భాస్కర్‌ దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో హరిత, వెంకటేష్‌లను అరెస్ట్‌ చేశాడు.

పాపభీతితో పొక్కిన నేరం...

హరిత భర్త భాస్కర్‌ను చంపేందుకు వెంకటేష్‌ పథకం వేశాడు. ఆమె వెళ్లినా తనపై అనుమానం రాకుండా ఉండేందుకు అయ్యప్పమాల వేశాడు. తెలిసిన నేరస్థుడు నవీన్‌తో మాట్లాడాడు. రూ.3లక్షల నగదు ఇచ్చాడు. హరిత వెళ్లి రెండు, మూడు రోజులైనా భాస్కర్‌ను చంపకపోవడంతో వెంకటేష్‌ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో నవీన్‌ మరో రూ.2లక్షలిస్తే కచ్చితంగా ఖతం చేస్తామంటూ చెప్పడంతో రూ.2లక్షలు ఇచ్చాడు.

ఈ డబ్బును నవీన్‌ నల్గొండలో ఉంటున్న రౌడీషీటర్‌ రాజేష్‌కు ఇచ్చాడు. భాస్కర్‌ను చంపకపోవడంతో ఈసారి హరిత ఫోన్‌ చేసి చంపేస్తారా? లేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. భాస్కర్‌ను ఎందుకు చంపలేకపోతున్నామన్న అనుమానాన్ని వెంకటేష్‌ తన గురువు వద్ద వ్యక్తం చేయగా.. అయ్యప్పమాల వేసినప్పుడు ఇలాంటి పాపపు పనులు చేయకూడదంటూ అతడు చెప్పాడు. దీంతో వెంకటేష్‌లో పాపభీతి పెరిగింది.. తన సన్నిహితులతో ఈ విషయం చెప్పగా.. వారు భాస్కర్‌కు చేరవేయడం, పోలీసులకు సమాచారం అందడంతో హరిత, వెంకటేష్‌, నవీన్‌లను ఎల్బీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి అరెస్ట్‌ చేశారు.

ఇదీ చదవండి:Wife Murder Plan: భర్త హత్యకు ప్రియుడితో కలసి వినూత్న పథకం వేసిన భార్య

Last Updated : Mar 23, 2022, 9:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.