క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో బంగారు భవిష్యత్తును అర్ధాంతరంగా ముగించింది ఓ విద్యార్థిని. తమ కుమార్తెను వైద్యురాలిగా చూడాలనుకున్న కన్నవారికి శోకాన్ని మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. నీట్ పరీక్షలో అర్హత సాధించలేదని మనస్తాపానికి గురైన విద్యార్థిని బలవన్మరణానికి (NEET Student Suicide)పాల్పడింది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీన్ని గమనించిన విద్యార్థిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.
జిల్లాలోని మక్త క్యాసారం గ్రామానికి చెందిన సంజీవులు, యాదమ్మ పెద్ద కుమార్తె సాయి లత.. గాయత్రి కళాశాలలో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంది. తల్లిదండ్రులు రోజూ వారి కూలీలు కావడంతో తాను చదువులో రాణించి కుటుంబాన్ని ఆదుకోవాలని భావించింది. మెడికల్ సీటే లక్ష్యంగా రెండు సంవత్సరాలు కష్టపడి చదివింది. అయిననప్పటికీ తమ కుమార్తె కోసం పడిన కష్టమంతా వృథా విద్యార్థిని తండ్రి సంజీవులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడవద్దని.. మరోసారి ప్రయత్నించి ఇతర కోర్సుల్లో చేరాలని పోలీసులు సూచించారు.
నీట్‌పై తమిళనాడు సీఎం లేఖలు
కేంద్రం ప్రవేశపెట్టిన నీట్ పరీక్షను అడ్డుకునేందుకు మద్దతు కూడగడుతున్నారు తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్(stalin cm of tamil nadu ). విద్యావ్యవస్థలో రాష్ట్రాలకే ప్రాధాన్యం ఉండేలా చూడడంలో సహకారం అందించాలని పిలుపునిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు స్టాలిన్. అంతేకాకుండా.. ఆయా రాష్ట్రాల్లోని అగ్రనేతలతో సంప్రదింపులు జరిపేందుకు పార్టీ ఎంపీని పంపించారు(neet tamil nadu issue).ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, దిల్లీ, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, బంగాల్, గోవా సీఎంలకు ఈ లేఖలు వెళ్లాయి.
నీట్‌పై జస్టిస్ ఏకే రాజన్ కమిటీ రూపొందించిన నివేదికను కూడా లేఖతోపాటు పంపారు స్టాలిన్. నివేదికను చదివి, గ్రామీణ, అట్టడుగు వర్గాల విద్యార్థులు మెరుగైన స్థితిలో నిలిచి, ఉన్నత విద్యను అందుకునే విధంగా మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: