Young Man Died in Germany : జర్మనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగర్‌కర్నూల్ జిల్లా వాసి అమర్‌సింగ్ (27) మృతిచెందారు. ఈ ప్రమాదం ఆదివారం జరగ్గా.. బుధవారం రాత్రి అమర్ కుటుంబసభ్యులకు అధికారులు సమాచారమిచ్చారు. అచ్చంపేట మండలం అక్కారానికి చెందిన అమర్‌సింగ్.. ఉన్నత చదువుల కోసం కొంతకాలం క్రితం జర్మనీ వెళ్లారు.
![Young Man Died in Germany](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14756841_thu.jpg)
Telangana Man Died in Germany : ఈనెల 13న స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా.. ఆ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అమర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలియని అతని కుటుంబ సభ్యులు.. మూడ్రోజులుగా తమ కుమారుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని ఆందోళనకు గురయ్యారు. అతడి స్నేహితులకు కాల్ చేసినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఏం జరిగిందోనని కంగారు పడ్డారు. ఇంతలోనే జర్మనీ అధికారుల నుంచి అమర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడనే వార్త విని ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. మంచి భవిష్యత్ కోసం జర్మనీకి పంపిస్తే.. తమ కుమారుణ్ని ఆ మృత్యువు తీసుకెళ్లిందని అమర్ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
![Young Man Died in Germany](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-mbnr-1-17-germany-yuvakudu-mruti-av-ts10050_17032022112534_1703f_1647496534_1087.jpg)
అమర్‌సింగ్ మృతదేహాన్ని స్వగ్రామం రప్పించాలని అతడి కుటుంబం ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన ఆయన.. మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. కేటీఆర్ కూడా జర్మనీ అధికారులతో మాట్లాడి అమర్ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పిస్తానని హామీ ఇచ్చారు.
![Young Man Died in Germany](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-mbnr-1-17-germany-yuvakudu-mruti-av-ts10050_17032022112534_1703f_1647496534_589.jpg)