ETV Bharat / crime

Murder Attempt CCTV footage: మూడో పెళ్లి వద్దన్నందుకు అన్ననే చంపబోయాడు... - Murder Attempt CCTV footage

Murder Attempt CCTV footage: మూడో పెళ్లి వద్దన్నందుకు అన్నపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ తమ్ముడు. దారిలో కాపు కాసి మరీ దాడి చేశాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలో జరిగింది. హత్యాయత్నానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

Murder Attempt CCTV footage
అన్నపై తమ్ముడు హత్యాయత్నం
author img

By

Published : Jan 6, 2022, 7:27 PM IST

Murder Attempt CCTV footage: మూడో పెళ్లి వద్దన్నందుకు అన్నపైనే కక్ష పెంచుకున్నాడు ఓ తమ్ముడు. ఏకంగా అతన్ని అంతమొందించాలనుకున్నాడు. తన అనుచరులతో కలిసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట పరిధిలో చోటు చేసుకుంది.

దారిలో కాపు కాసి.. కళ్లలో కారం కొట్టి

Brother Murder Attempt :: దారిలో కాపు కాసి మరీ.. కళ్లలో కారం చల్లి విచక్షణారహితంగా దాడి చేశారు. దాడికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ ఘటన కాస్త ఆలస్యంగా బయటికొచ్చింది. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

murder attempt at jagadgiri gutta: జగద్గిరిగుట్టలోని పాపిరెడ్డి నగర్​లో నివాసముండే అభిమన్య కుమార్​కు ఇది వరకే రెండు పెళ్లిళ్లు జరిగాయి. అనంతరం అతను మరో పెళ్లికి సిద్ధమవ్వగా అతని అన్న చేతన్​ కుమార్, అతని భార్య.. మూడో పెళ్లి చేసుకోవద్దని వారించారు. ఈ విషయాన్ని తమ్ముడి భార్యకు తెలపడంతో వారి మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో కోపోద్రిక్తుడైన అభిమన్య కుమార్ అన్నపై కక్ష పెంచుకున్నాడు.

నిన్న మధ్యాహ్న సమయంలో చేతన్ కుమార్ తన ఇంటి నుంచి ఆస్బెస్టాస్ కాలనీ వైపు వెళ్లగా మార్గమధ్యలో అతడి ద్విచక్రవాహనాన్ని అడ్డుకున్నాడు. అనంతరం కళ్లలో కారం కొట్టి కత్తులతో దాడి చేశారు. తన భర్తపై మరిది అభిమన్య కుమార్ దాడికి పాల్పడ్డారని చేతన్ కుమార్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సీసీ కెమెరాల్లో రికార్డైన హత్యాయత్నం దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.