హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. బుధవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఆసిఫ్‌నగర్ పరిధిలో ఆదిల్ అనే వ్యక్తి రాజేంద్రనగర్‌కు చెందిన సయ్యద్ జహీర్ అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని జహీర్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్నారని తెలిపారు. గతనెల 22న బెయిల్‌పై బయటకు వచ్చారని వెల్లడించారు.
- ఇదీ చూడండి : న్యాయవాదుల హత్యను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు