ETV Bharat / crime

అమ్మతనానికే మచ్చ తెచ్చే పని చేసిన తల్లి.. ఆడపిల్ల అని తెలిసి..

Humanity Is The Forgotten Mother: అభంశుభం ఎరుగని పసికందును కర్కశ తల్లి ఎండలో పెట్టేసింది. అమ్మతనానికే మచ్చ తెచ్చే విధంగా చేసింది. చిన్నారి మృతి చెందింది. ఇంతకీ అసలు ఏం జరిగింది?

baby died
చిన్నారి మృతి
author img

By

Published : Feb 8, 2023, 9:58 PM IST

Mother Who Left Her Baby In The Sun: అమ్మ నేను ఈ భూమి మీదకు రావాలనుకుంటున్నాను. అందరిలాగే నాకు కూడా జీవించాలని ఉందని అంటూ ఓ పసికందు ఏడుస్తుంది.. అయినా నీ మనసు కరగలేదా.. ఎందుకమ్మా ఆడపిల్ల అని తెలియగానే కడుపులోనే తుంచేయాలని చూస్తుంది ఈ సమాజం. నేను ఏం పాపం చేశాను. ఆడపిల్లగా పుట్టడమేనా నేను చేసిన పాపమా. మగ పిల్లాడిలా నాకు కూడా ఈ భూమి మీద జీవించే సమాన హక్కులు ఉన్నాయి. అన్నింటిలోనూ వారిలాగే మేము కూడా రాణించగలుగుతున్నాము. పిల్లలు లేక ఎందరో డాక్టర్లు, పుణ్య క్షేత్రాలు అంటూ తిరుగుతూ ఉంటే.. పిల్లలు పుట్టిన నీకు ఎందుకమ్మా.. ఆడపిల్ల అని తెలియగానే వదిలేయాలని పించింది అంటూ ఏ ఆడపిల్ల రోధిస్తోంది.

ఆడపిల్ల అని తెలిస్తే కొందరి కర్కష తండ్రులు వదిలేయాలని చూస్తారు. కానీ ఇక్కడ అందుకు భిన్నంగా మానవత్వం లేని ఓ తల్లినే ఇలా చేసింది. తాను అమ్మ కాకముందు.. ఆడపిల్లనే కదా నేను అన్న కూడా విషయం మరిచిపోయి ప్రవర్తించింది. నవమాసాలు తర్వాత ఆడపిల్ల పుట్టిందని తెలిసి గుట్టుచప్పుడు కాకుండా వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయి.. అమ్మతనానికి చేరగని మచ్చ తెచ్చే విధంగా చేసింది. ఈ విషాదకరమైన గుండెలను పిండేసే ఘటన హైదరాబాద్​లోని కుత్బుల్లాపూర్​లో అయోధ్యనగర్​లో జరిగింది.

జీడిమెట్ల పీఎస్​ పరిధిలోని అయోధ్యనగర్​లో అప్పుడే పుట్టిన ఆడ శిశివును ఎండలో ఓ ఇంటి కప్పుపై పెట్టేసి మానవత్వం లేని కర్కష తల్లి వెళ్లిపోయింది. ఎండ తాకిడి ఎక్కువగా ఉండడంతో పాప ఏడుస్తుంది. ఈ ఏడుపును విన్న స్థానికులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ ఏడుపులు అని చూస్తే ఇంటిపై ఉందని గుర్తించి.. చుట్టుపక్కల ఉన్నవారిని విచారించగా ఎవరికీ తెలియదని చెప్పడంతో దగ్గరలోని జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు..ఆ ఇంటిపై నుంచి నవజాత శిశువును కిందకు దించారు. షాపూర్​నగర్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పాప పరిస్థితి అప్పటికే విషమంగా మారింది.

ఆక్సిజన్​ లెవెల్స్​ పడిపోవడంతో మెరుగైన వైద్యం కోసం నగరంలోని నిలోఫర్​ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అభంశుభం ఎరుగని చిన్నారి మధ్యాహ్నం మృతి చెందింది. ఎండలో సుమారు నాలుగైదు గంటలు ఏడుస్తూ ఉండడం వల్లే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తును ప్రారంభించారు.

శిశువును ఎండలో ఉంచేసిన తల్లి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.