నాగసర్పదోషం ఉందని కన్న బిడ్డనే అతి కిరాతకంగా చంపింది ఓ తల్లి. సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాటితండాకు చెందిన బానోతు భారతి అనే మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. తన ఆరు నెలల చిన్నారికి దోషం ఉందంటూ ఓ దొంగబాబా చెప్పిన మాయమాటలు నమ్మి... పేగు బంధాన్ని తెంచుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో కన్న కూతురుని జాలి లేకుండా దేవుడి చిత్రాలను పాప ముందు ఉంచి పూజలు నిర్వహించింది.
అనంతరం కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసింది. బిడ్డను హతమార్చిన అనంతరం తనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తమకు చెప్పిందని స్థానికులు తెలిపారు. కొంత కాలంగా భారతికి మతిస్తిమితం సరిగా ఉండడం లేదని చెబుతున్నారు. ఆరు నెలలుగా ఓ బాబా మాటలు నమ్మి ఆయన చెప్పినట్లుగా పూజలు చేస్తోందని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కరోనాతో మాజీ మంత్రి చందూలాల్ కన్నుమూత